ఆ తేదీన రీ-రిలీజ్ కానున్న 'సినిమా చూపిస్త మామ'

by Pulgam srinivas |

‘సినిమా చూపిస్త మావ’ చిత్రాన్ని జూన్ 27న రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆ తేదీన రీ-రిలీజ్ కానున్న సినిమా చూపిస్త మామ
X

దిశ, వెబ్ డెస్క్: రాజ్ తరుణ్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సినిమా చూపిస్త మామ’. 2015లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల కాలంలో పలు తెలుగు సినిమాలు రీ-రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సినిమా చూపిస్త మామ’ చిత్రాన్ని కూడా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను జూన్ 27వ తేదీన రీ-రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. మరి రీ-రిలీజ్‌లో భాగంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్ర పోషించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ (జి. సునీత), రూపేష్ డి. గోహిల్ సంయుక్తంగా నిర్మించారు.




Next Story