కష్టకాలంలో చేయూతగా సీఎం రిలీఫ్ ఫండ్.. డోర్ టు డోర్ చెక్కుల పంపిణీ

by Batti.Sumithra |

పేద ప్రజలకు ఆపద సమయంలో భరోసాగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) రేవల్లి మండలంలో ఆరు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది.

కష్టకాలంలో చేయూతగా సీఎం రిలీఫ్ ఫండ్.. డోర్ టు డోర్ చెక్కుల పంపిణీ
X

దిశ, రేవల్లి : పేద ప్రజలకు ఆపద సమయంలో భరోసాగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) రేవల్లి మండలంలో ఆరు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.డి. సుల్తాన్ ఆలీ ఆధ్వర్యంలో నాయకులు డోర్ టు డోర్ వెళ్లి లబ్ధిదారులైన యాతం మనిషాకు రూ.20,500, బీరం బాల్‌రెడ్డికి రూ.1,00,000, మాడుగుల శేఖర్‌రెడ్డికి రూ.1,12,000, కోప్పునవోని పుష్యవతికి రూ.35,500, ఎలాకాయల బాలమ్మకు రూ.26,000, అంగోతు బస్తీరాంకు రూ.31,000 చొప్పున చెక్కులను మొత్తం రూ.3.25 లక్షల విలువైన సహాయనిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా సుల్తాన్ అలి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలా మారిందన్నారు. వైద్య ఖర్చులు, అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు వాడల పర్వతాలు, సర్పంచ్ టప్ప రాజయ్య, శ్రీనివాస్,ఎద్దుల కుర్మయ్య, రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story