ఏపీలో దారుణం.. ఇన్‌స్టాలో ప‌రిచ‌య‌మైన వ్యక్తి కోసం భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌

by Ajay Maddhiboyina |   (  Updated:2026-06-14 06:11:30  IST  )

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం ఓ మహిళ భర్తకు మత్తు మందు ఇచ్చి ఆపై హత్య చేసింది. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ ఆటో నడుపుతూ భార్య, ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్నాడు.

ఏపీలో దారుణం.. ఇన్‌స్టాలో ప‌రిచ‌య‌మైన వ్యక్తి కోసం భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడి కోసం ఓ మహిళ భర్తకు మత్తు మందు ఇచ్చి ఆపై హత్య చేసింది. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ ఆటో నడుపుతూ భార్య, ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్నాడు. ఈ క్రమలో రెండేళ్ల క్రితం దుర్గాప్రసాద్‌కు గుండె సంబంధిత సమస్య రావడంతో వైద్యులు స్టెంట్లు వేశారు. దీంతో అప్పటి నుండి అతను ఇంటికే పరిమితం అయ్యాడు. అయితే కష్టసమయంలో భర్తకు తోడుగా ఉండాల్సిన భార్య మాత్రం అతడిని పట్టించుకోకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో టైమ్ పాస్ చేస్తూ బాపట్లకు చెందిన ఓ వ్యక్తికి దగ్గరైంది.

ఇన్‌స్టాలో ఏర్పడిన ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్తకు విషయం తెలిసి మందలించడంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాని నిర్ణయించుకుంది. భర్తకు కర్భూజా జ్యూస్‌లో స్లీపింగ్ ట్యాబ్లెట్ కలిపి ఇచ్చి అతడు నిద్రలోకి జారుకున్న తరవాత దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది.అనంతరం కేసు నుండి తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రియుడు ఆమె ఫోన్ కు పంపిన వాట్సాప్ మెసేజ్ ద్వారా అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితురాలని అరెస్ట్ చేయగా అటు తండ్రి చనిపోవడం, ఇటు తల్లి జైలుకు వెళ్లడంతో ఇద్దరు కుమార్తెలు అనాథలు అయ్యారు.

Next Story