- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొండంరాజుపల్లిలో ఐదు నెమళ్లు మృతి
నంగునూరు మండలం కొండంరాజుపల్లి గ్రామ శివారులో ఏనుగు రాళ్ల సమీపంలో ఐదు జాతీయ పక్షులు నెమళ్ళు అనుమానాస్పద స్థితిలో చనిపోయాయి.

దిశ, నంగునూరు: నంగునూరు మండలం కొండంరాజుపల్లి గ్రామ శివారులో ఏనుగు రాళ్ల సమీపంలో ఐదు జాతీయ పక్షులు నెమళ్ళు అనుమానాస్పద స్థితిలో చనిపోయాయి. ఒకేచోట ఐదు జాతీయ పక్షులు మృతి చెందడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. నెమళ్ళు చనిపోయిన విషయాన్ని ఆదివారం గుర్తించిన కొండంరాజుపల్లి గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు అటవీ శాఖకు చెందిన సిద్దిపేట డిప్యూటీ రేంజ్ అధికారి జె.పద్మ, ఫారెస్ట్ బీట్ అధికారి (ఎఫ్‌బీఓ) ఎస్.రవి కిరణ్‌తో పాటు అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నెమళ్లు మృతి చెందిన ప్రదేశాన్ని పరిశీలించారు. చనిపోయిన నెమళ్లను పరిశీలించి వివరాలు సేకరించారు. నెమళ్లు విషపూరిత ఆహారం తీసుకోవడం వల్ల మృతి చెందాయా ఏదైనా వ్యాధి వల్ల చని పోయాయా లేక కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. మృతి చెందిన నెమళ్ళకు పోస్టుమార్టం నిర్వహించారు. నమూనాలను పరీక్షలకు పంపించారు. నమూనా పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత నెమళ్ళ మృతికి గల కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒకేసారి ఐదు నెమళ్లు మృతి చెందడం వన్యప్రాణి ప్రేమికులను, గ్రామస్థులను ఆందోళనకు గురి చేసింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. నివేదిక ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.






