మేం అధికారంలోకి వస్తే చర్యలు తప్పవ్: డీఎస్సీ అవకతవకలపై సజ్జల వార్నింగ్

by Vemula.Srinu Prasad |

మేం అధికారంలోకి వస్తే చర్యలు తప్పవ్: డీఎస్సీ అవకతవకలపై సజ్జల వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తాము అధికారంలోకి వస్తే డీఎస్సీ(DSC)లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Ycp Leader Sajjala Ramakrishna Reddy) హెచ్చరించారు. డీఎస్సీ అభ్యర్థులు గుంటూరు తాడేపల్లి వైసీపీ కార్యాలయం(Guntur Tadepalli Ycp Office)లో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ డీఎస్సీ స్కామ్‌పై చివరివరకు పోరాడతామన్నారు. అప్పటి వరకూ డీఎస్సీ బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎందుకు సమాధానం చెప్పడంలేదని ప్రశ్నించారు. రోస్టర్ విధానంలోనూ తీవ్రమైన లోపాలున్నాయని ఆరోపించారు. డీఎస్సీ నిర్వహణపై పారదర్శక విచారణ జరపకుండా కప్పిపుచ్చుతున్నారని విమర్శించారు. ముందస్తు కుట్రతోనే డీఎస్సీ స్కామ్ జరిగిందని సజ్జల వ్యాఖ్యానించారు.

Next Story