పెన్నార్ కార్మికులకు అండగా బీఆర్టీయు

by Taduka Kalyani |

రాబోయే రోజుల్లో మరిన్ని హక్కులు సాధించేందుకు కృషి చేస్తున్న బీఆర్టీయు యూనియన్ ను పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

పెన్నార్ కార్మికులకు అండగా బీఆర్టీయు
X

దిశ, పటాన్ చెరు టౌన్ : పెన్నార్ పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి కార్మికుడికి అండగా నిలుస్తూ మెరుగైన వేతన ఒప్పందం అందించడంతోపాటు రాబోయే రోజుల్లో మరిన్ని హక్కులు సాధించేందుకు కృషి చేస్తున్న బీఆర్టీయు యూనియన్ ను పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్టీయు (పెన్నార్ ఇండస్ట్రీస్) సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పరిశ్రమ గుర్తింపు కార్మిక సంఘంగా బీఆర్టీయు యూనియన్ కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ వారి మన్ననలు పొందడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు పరచడంతో పాటు సీటీసి లేకుండా వేతన ఒప్పందం, పెండింగ్ సమస్యలను పరిష్కరించడం, మెడికల్ ఇన్సూరెన్స్ పరిమితి, ఫెస్టివల్ అడ్వాన్స్, ఎడ్యుకేషన్ లోన్, మహిళా కార్మికుల కోసం ప్రత్యేక సెలవులు, అటెండెన్స్ బోనస్ పెంచడం జరిగిందని తెలిపారు. ఈ నెల 20న జరగనున్న పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో గంట గుర్తుపై ఓటు వేసి బీఆర్టీయు యూనియన్ నీ గెలిపిస్తే.. అందరికీ ఆమోదయోగ్యమైన వేతన ఒప్పందం, ప్రశాంత వాతావరణంలో విధుల నిర్వహణ, శాశ్వత ఉద్యోగ నియామకాలను పెంచడం, న్యాయబద్ధంగా యాజమాన్యం నుంచి కార్మికులు రావాల్సిన బెనిఫిట్స్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు రాంబాబు యాదవ్, రాష్ట్ర కార్యదర్శి, యూనియన్ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, కార్మిక సంఘం ప్రతినిధులు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Next Story