- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడ్వాయి నిరుపేద ఎంబీబీఎస్ విద్యార్థినికి ఆర్థిక తోడ్పాటు: హరీష్ రావు
చదువుకు పేదరికం అడ్డుకాకూడదు అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

దిశ, తాడ్వాయి: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం అది.. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నా ఆ నిరుపేద విద్యార్థిని పట్టుదలతో చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆర్థిక ఇబ్బందులు చదువుకు శాపంగా మారాయి. ఈ క్రమంలోనే ఆ విద్యార్థిని ప్రతిభను గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపడంతో, మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన అశోక్ నిరుపేద కార్మికుడు. రోజు వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె సౌమ్య కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించింది. ఇప్పటికే మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సౌమ్య.. తదుపరి చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వైద్యురాలై సమాజానికి సేవ చేయాలనే తన పెద్ద లక్ష్యానికి పేదరికం అడ్డురావడంతో తండ్రీకూతుళ్లు ఆందోళన చెందారు.
పూర్తి ఆర్థిక తోడ్పాటు అందిస్తా...
ఈ విషయాన్ని గమనించిన తాడ్వాయి గ్రామ సర్పంచ్ మెట్టు విజయ రాములు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆదివారం సర్పంచ్ ఆధ్వర్యంలో విద్యార్థిని సౌమ్య, ఆమె తండ్రి అశోక్ కలిసి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావును ఆశ్రయించారు. విద్యార్థిని ఆర్థిక పరిస్థితిని, ఆమె చదువు పట్ల ఉన్న ఆసక్తిని సర్పంచ్ మాజీ మంత్రికి వివరించారు. ఆర్థిక తోడ్పాటు అందిస్తానని హామీ సౌమ్య ప్రతిభను, కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్న హరీష్ రావు సానుకూలంగా స్పందించారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న సౌమ్యకు చదువు నిమిత్తం ఈ సంవత్సరం పూర్తి ఆర్థిక తోడ్పాటు అందిస్తానని, అధైర్యపడకుండా బాగా చదువుకోవాలని భరోసా కల్పించారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన పేర్కొన్నారు. తమ కష్ట కాలంలో అండగా నిలిచి, ఉన్నత చదువుకు భరోసా ఇచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు, అలాగే ఈ విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి తమకు మార్గం చూపిన తాడ్వాయి సర్పంచ్ మెట్టు విజయ రాములుకు విద్యార్థిని తండ్రి అశోక్, కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.






