- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలం శివయ్యకు కుచ్చుటోపీ... క్షమాపణలకు రెడీ అంటూ ఎమ్మెల్యే సవాల్
శ్రీశైలం శివయ్యకు కుచ్చుటోపీ పెట్టారంటూ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డిపై జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తన సోదరుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి పేరుతో తమ తల్లిదండ్రులు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కొంత స్థలం కొనుగోలు చేసి అక్కడ కాటేజీ నిర్మించి ఆ తాళాలను దేవస్థానానికి అప్పగించారని ఆయన తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం శివయ్య(Srisailam Sivaiah)కు కుచ్చుటోపీ పెట్టారంటూ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి(Darsi Mla Buchepalli Srivaprasadareddy)పై జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తన సోదరుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి పేరుతో తమ తల్లిదండ్రులు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కొంత స్థలం కొనుగోలు చేసి అక్కడ కాటేజీ నిర్మించి ఆ తాళాలను దేవస్థానానికి అప్పగించారని ఆయన తెలిపారు. తమ తల్లిదండ్రులు ఎన్నో గుడులకు, గోపురాలకు అలాగే పేదలకు ఎన్నో సహాయ సహకారాలు చేశారని, అలాంటిది దేవుడు శివయ్యకు తాము కుచ్చుటోపీ పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేవుడు సొమ్మ వాడుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రధాని మోడీ వచ్చిన సమయంలో ఆ కాటేజీని వినియోగించుకున్నారని గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న పనుల వల్ల తాళాలు తీసుకున్నాగాని మళ్లీ తిరిగి ఇచ్చేమని చెప్పారు. 20 ఏళ్లలో తాను ఒకేసారి శివయ్యను దర్శించుకున్నానని తెలిపారు. దేవుడి సొమ్మును, ప్రాంగాణాన్ని బూచేపల్లి కుటుంబానికి వాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేవుడి దగ్గర కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
దేవుడి సొమ్ముపై రాజకీయాలా..?
తాము దేవుడి సొమ్మును తీసుకున్నామని మూడుసార్లు నోటీసులు పంపామని చెబుతున్నారని, కానీ ఒక్కసారి కూడా తమకు అందలేదన్నారు. రిజిస్ట్రార్ పోస్టు కాగితాన్ని తీసి చూపించాలని సవాల్ విసిరారు. ఒక్కసారి కూడా తమకు నోటీసులు పంపలేదన్నారు. తమకు నోటీసులు పంపినట్లు నిరూపిస్తే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. లేనిపక్షంలో కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నేతలను ఆ శివయ్య విడిచిపెట్టరని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ హెచ్చరించారు. తమ శివయ్య క్షేత్రానికి నష్టం జరిగిందని నిరూపిస్తే ఎంత డొనేషన్ ఇవ్వమన్నా ఇస్తామని ఆయన వెల్లడించారు.
శివప్రసాద్ రెడ్డి ట్వీట్






