మోహన్ నగర్‌లో భారీ చోరీ

by Jakkula.Mamatha |

వ్యక్తిగత పనుల నిమిత్తం తన స్వగ్రామానికి వెళ్లిన కుటుంబం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

మోహన్ నగర్‌లో భారీ చోరీ
X

దిశ, చైతన్యపురి: వ్యక్తిగత పనుల నిమిత్తం తన స్వగ్రామానికి వెళ్లిన కుటుంబం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కే.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్‌లో గల బృందావనం అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పాలెం అశోక్ కుమార్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 9న స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహారం గ్రామానికి వ్యక్తిగత పనుల నిమిత్తం వెళ్లారు.

తిరిగి ఈనెల 13న సాయంత్రం తన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు 11 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2.50 లక్షలు నగదు, 2 కిలోల వెండి వస్తువులు సహా విలువైన వస్తువులను అపహరించినట్లు ప్రాథమిక అంచనా వేశారు. వెంటనే బాధితులు తమకు సమాచారం ఇవ్వగా ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారంగా చోరీకి పాల్పడిన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

Next Story