- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌తో కలిసి ‘భారత్ ఇన్నోవేట్స్’ ప్రారంభం.. ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్
యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లోని నైస్ (Nice) నగరానికి చేరుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లోని నైస్ (Nice) నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆయనకు ఆత్మీయ ఆలింగనంతో ఘన స్వాగతం పలికారు. తన ప్రియ మిత్రుడిని కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్న ప్రధాని మోడీ, ఆ ఫోటోను తన ‘ఎక్స్’ (X) ఖాతాలో పంచుకున్నారు.
‘భారత్ ఇన్నోవేట్స్-2026’ ప్రారంభం
నైస్ నగరంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఆవిష్కరణల సదస్సును మోడీ, మేక్రాన్ ఆదివారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేక్రాన్‌కు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్, ఫ్రాన్స్ దేశాలు ప్రస్తుత ఏడాదిని ‘ఆవిష్కరణల సంవత్సరం (Year of Innovation)’గా జరుపుకుంటున్నాయని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
స్లోవేకియాకు పయనం
విద్యాసంస్థల నుంచి వస్తున్న అత్యుత్తమ భారతీయ టెక్ స్టార్టప్‌లను గుర్తించి, వారిని అంతర్జాతీయ పెట్టుబడిదారులతో (VCs), పరిశ్రమల అధినేతలతో అనుసంధానం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. సదస్సుకు ముందు ప్రధాని పలువురు అగ్రశ్రేణి పెట్టుబడిదారులతో ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ‘స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్’ సహా పలు కీలక ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించనున్నారు. కాగా, అంతకుముందు విమానాశ్రయంలో ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారుల నుంచి స్వాగతం అందుకున్న ప్రధాని మోడీ.. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం రాత్రి తన పర్యటనలో రెండో దశ కోసం స్లోవేకియాకు పయనం కానున్నారు.






