- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుంటూరులో లిక్విడ్ గంజాయి కలకలం.. వాహన తనిఖీల్లో ముగ్గురు అరెస్ట్
లిక్విడ్ గంజాయి కలిగిన ముగ్గురు వ్యక్తులను గుంటూరు లాలాపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు లాలాపేట పోలీస్ స్టేషన్ ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. లాలాపేట ఇన్స్పెక్టర్ ఏవి .శివ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి లాలాపేట ఎస్సై వి. వెంకటరావు, సిబ్బంది కలిసి ఐపీడీ కాలనీ సమీపంలోని శ్రీ సత్యసాయి ట్రస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు....

దిశ, గుంటూరు ప్రతినిధి: లిక్విడ్ గంజాయి కలిగిన ముగ్గురు వ్యక్తులను గుంటూరు లాలాపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు లాలాపేట పోలీస్ స్టేషన్ ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. లాలాపేట ఇన్స్పెక్టర్ ఏవి .శివ ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి లాలాపేట ఎస్సై వి. వెంకటరావు, సిబ్బంది కలిసి ఐపీడీ కాలనీ సమీపంలోని శ్రీ సత్యసాయి ట్రస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. అయితే మహీంద్రా వాహనాన్ని ఆపి సోదాలు చేశారు. రెండు పాలిథిన్ కవర్లలో నిల్వ ఉంచిన లిక్విడ్ గంజాయి, మూడు ప్లాస్టిక్ కంటైనర్లలో ఉన్న లిక్విడ్ గంజాయి, 20 ఖాళీ ప్లాస్టిక్ కంటైనర్లు, లిక్విడ్ గంజాయి ఆనవాళ్లు ఉన్న ఒక లీటర్ ప్లాస్టిక్ బాటిల్, గంజాయి సిగరెట్ల తయారీకి ఉపయోగించే రోలింగ్ పేపర్లు తదితర వస్తువులు లభ్యమయ్యాయి. డిజిటల్ తూకం ద్వారా పరిశీలించగా మొత్తం 2.110 కిలోల లిక్విడ్ గంజాయి ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. గుంటూరు నగరానికి చెందిన రామిశెట్టి మహావీర్, అబ్బు సాయి మణికంఠ తేజ, షేక్ రహంతుల్లాలను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి లిక్విడ్ గంజాయిని కొనుగోలు చేసి గుంటూరుకు తరలించి, చిన్న చిన్న కంటైనర్లలో ప్యాకింగ్ చేసి మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అదేవిధంగా నిందితులు స్వయంగా కూడా లిక్విడ్ గంజాయిని వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ముద్దాయిల వద్ద నుంచి 2.110 కిలోల లిక్విడ్ గంజాయిని మహీంద్రా కార్‌ను స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ – ఒడిశా ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న మరో ఇద్దరు వ్యక్తులను, నిందితుల నుండి గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తున్న మరి కొంతమందిని అదుపులోనికి తీసుకోవలిసి ఉందని తెలిపారు.






