రైతులకు యూరియా ముందస్తుగా నిల్వలు చేయాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి

by Jakkula.Mamatha |

నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై పీడియట్ కేసు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు.

రైతులకు యూరియా ముందస్తుగా నిల్వలు చేయాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి
X

దిశ, చింతకాని: తెలంగాణ ప్రభుత్వం విత్తనాలు తయారు చేసే కంపెనీల పై ఆంక్షలు విధించాలని గుర్తింపు పొందిన విత్తన సంస్థలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే కంపెనీలపై పీడియట్ కేసు నమోదు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని రాయల వీరయ్య భవనంలో పార్టీ మండల కమిటీ సమావేశంలో తోటకూరి వెంకట నరసయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ శాతం నకిలీ విత్తనాలు తయారు చేసి రైతుల్ని నిలువున ముంచేస్తున్నారని గతంలో నాసిరకం విత్తనాలు నాటడం దిగుబడి రాక రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయి పురుగులు కీటకాలు ఎక్కువగా ప్రత్యక్షమై పంట దిగుబడి తగ్గి పోయిందన్నారు. నాసిరకం కంపెనీలపై దృష్టి పెట్టి వాటిని అరికట్టాలన్నారు. అంతే కాకుండా మార్క్‌ఫైడ్ కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసి రెండు నెలలు పూర్తవుతున్న కానీ మొక్కజొన్నలు అమ్ముకున్న రైతుల ఖాతాలలో డబ్బులు తక్షణమే జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా గత సీజన్లో రైతులు యూరియా కొరకు చాలా అవస్థలు పడిన పరిస్థితి చూశామన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం ముందస్తుగా ఈ వ్యవసాయ సీజన్లో రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని కోరారు. రైతాంగానికి ఎక్కువ శాతం ప్రాముఖ్యత ఇస్తేనే ఏ ప్రభుత్వమైనా ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి మడుగుల్లి గోపాలరావు, వత్సవాయి జానకి రాములు, దేశ బోయిన ఉపేందర్, మధిర డివిజన్ కమిటీ సభ్యులు ఆలస్యం రవి, మడుపల్లి కిరణ్ బాబు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు కాటా బత్తిన వీరబాబు, లింగం కోటి వాకా సీతారామిరెడ్డి, గడ్డం రమణ, కోటేశ్వరరావు, నన్నక కృష్ణమూర్తి, జల్లేపల్లి పుల్లయ్య, రౌతు అప్పారావు, ఓబిన బోయిన అచ్చయ్య, బల్లి వీరయ్య పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story