- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్వాడీ సెంటర్‌లో కుళ్ళిపోయిన గుడ్లు సరఫరా..
వల్లభాపురం తాండాలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పంపిణీ చేసిన గుడ్లు కుళ్లిపోయి ఉండటంతో గ్రామస్థులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వీపనగండ్ల: మండలంలోని వల్లభాపురం తాండాలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పంపిణీ చేసిన గుడ్లు కుళ్లిపోయి ఉండటంతో గ్రామస్థులు ఆవేద వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చదువుతున్న చిన్నారులకు ఒక్కొక్కరికి ఐదు గుడ్ల చొప్పున పంపిణీ చేశారు. గుడ్లు కుళ్లిపోయి నల్లగా మారి తీవ్ర దుర్వాసన వెదజల్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గుడ్లను పంపిణీ చేస్తుండగా, ఈ విధంగా నాసిరకం, కుళ్లిపోయిన గుడ్లు అందించడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పంపిణీ చేసే గుడ్ల నాణ్యతపై..
ఇలాంటి గుడ్లను తినడం వల్ల చిన్నారులు ఫుడ్ పాయిజనింగ్‌కు గురై ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అంగన్వాడీ టీచర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని గ్రామస్థులు ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ చేసే గుడ్ల నాణ్యతపై పర్యవేక్షణ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, అలాంటి చర్యలు కనిపించడం లేదని వారు వాపోయారు. రమ్య ఐసిడిఎస్ సూపర్వైజర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం నుంచి పంపిణీ చేసిన గుడ్లు కుళ్ళిపోయినట్లు తన దృష్టికి వచ్చిందని, ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు సెలవు కాబట్టి కేంద్రాలకు వెళ్లలేదని, సోమవారం రోజు వల్లభాపురం తండాకు వెళ్లి పూర్తి విచారణ చేపడతానని తెలిపారు.






