- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నలుగురు ఎంపీవోలకు ఎంపీడీవోలుగా పదోన్నతి
by Jakkula.Mamatha |
ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాల్లో పనిచేస్తున్న ఎంపీఓలకు ఎంపీడీవోలుగా పదోన్నతి లభించింది.

X
దిశ, వైరా: ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాల్లో పనిచేస్తున్న ఎంపీఓలకు ఎంపీడీవోలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్, ముదిగొండ, వైరా ఎంపీఓలుగా పనిచేస్తున్న పీ.రాజారావు, కే.శ్రీదేవి, వాల్మీకి కిషోర్, డి.రాజేశ్వరి ఎంపీడీవోలు గా పదోన్నతి పొందారు. సోమవారం వీరికి పోస్టింగులు ఇవ్వనున్నారు. ప్రస్తుతం పని చేసే జిల్లా కాకుండా మరో జిల్లాకు ఎంపీడీవోలుగా వీరిని బదిలీ చేస్తారని తెలిసింది. సోమవారం ఎంపీడీవోలు గా పదోన్నతి పొందిన అధికారులను హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ఆఫీసుకు రావాలని మండల పంచాయతీరాజ్ అధికారుల రాష్ట్ర సంఘం నాయకులు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ దివ్య పదోన్నతి పొందిన అధికారులతో మాట్లాడతారని పేర్కొన్నారు.
Next Story






