- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
by Jakkula.Mamatha |
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం నరసింహ ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం నరసింహ ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. అనువంశిక ధర్మకర్త బి.నరసింహ మూర్తి స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను న్యాయమూర్తికి అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన న్యాయమూర్తి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో మాట్లాడారు.
Next Story






