- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాకాలం మొదలైన కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు..
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మండల కమిటీ సమావేశం మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.

దిశ, వీపనగండ్ల: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మండల కమిటీ సమావేశం మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి బడ్జెట్లో కోత విధించడం జరిగిందని పథకం పేరు మార్చి రోజుకు రెండుసార్లు ఫోటోలు దింపే పద్ధతి వల్ల కూలీలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. పాత పద్ధతిలోనే ఈ వ్యవస్థ ఉండాలని 200 రోజులు పని దినాలు రోజుకు 600 కూలి ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. ఉపాధి కూలీ సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుందని, ఈ సందర్భంలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు జూన్ 20,21,22వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది.
రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలి..
జూన్ 20న రాష్ట్ర స్థాయి బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు ముఖ్యఅతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి సిపిఎం పొలిటి బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ హాజరవుతున్నారు. ఈ సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభమైన నేటికీ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలలో వడ్లు ఇంకా కొనుగోలు కాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసి, రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు మహబూబ్ పాషా, రవిప్రసాద్, మండల నాయకులు వి కృష్ణయ్య,ఆశన్న, ఈశ్వర్, సీహెచ్ వెంకటయ్య, ఖాజా హుస్సేన్, నిరంజన్, బాల గౌడ్, తదితరులు పాల్గొన్నారు.






