కేజీబీవీ రాజంపేట పాఠశాలలో అతిధి ఆంగ్ల మహిళ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

by Kodari Anjali |

ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించుటకు గాను అతిథి ఆంగ్ల ఉపాధ్యాయ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీవాణి తెలిపారు

కేజీబీవీ రాజంపేట పాఠశాలలో అతిధి ఆంగ్ల మహిళ ఉపాధ్యాయ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
X

దిశ, రాజంపేట్: రాజంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2026 -27 విద్య సంవత్సరం గాను ఇంగ్లీష్ సబ్జెక్టు బోధించుటకు గాను అతిథి ఆంగ్ల ఉపాధ్యాయ నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పాఠశాల ప్రత్యేక అధికారి శ్రీవాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఈ దరఖాస్తులను మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పాఠశాలలో స్వీకరించబడుతుందని తెలిపారు. ఇట్టి నియామకంకు బి.ఎడ్‌లో ఇంగ్లీష్ సబ్జెక్టు ఉండి టెట్ క్వాలిఫై అయిన వారు మాత్రమే అర్హులని అలాగే నైట్ డ్యూటీలు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని, బోధనలో అనుభవం ఉన్న వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వబడుతుందని తెలిపారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Next Story