- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీ వాగులో వరద ప్రవాహం
వేసవికాలంలో ఎండల తాకిడికి ఇబ్బందులకు గురైన ప్రజానీకానికి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఉపశమనం కలిగింది.

దిశ, శంకర్ పల్లి : వేసవికాలంలో ఎండల తాకిడికి ఇబ్బందులకు గురైన ప్రజానీకానికి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఉపశమనం కలిగింది. రోహిణి కార్తీ పూర్తయి మృగశిర కార్తె ప్రారంభంలో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఉపశమనం పొందారు. శనివారం శంకరపల్లి వికారాబాద్ నవాబ్ పేట్ పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో నీరు లేక వెలవెల పోయిన మూసి వాగు ప్రస్తుతం వర్షపు నీటి వరద ప్రవాహంతో కళకళలాడుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురవడంతో అర్ధరాత్రి దాటాక మూసి వాగులో వర్షపు నీటి ప్రవాహం ప్రారంభమైంది. వర్షాలు కురవడంతో రైతన్నలు వానాకాలం సీజన్ ఖరీఫ్ పంటలు వేయడంలో నిమగ్నమయ్యారు. అడపాదడ పై ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల కొన్ని గ్రామాల్లో రైతులు విత్తనాలు పెట్టడం ప్రారంభించగా మరి కొంతమంది విత్తనాలు సేకరించడం, పొలాలను చదును చేసుకోవడం పనుల్లో నిమగ్నమయ్యారు.






