- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాదగిరిగుట్టలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
by Jakkula.Mamatha |
యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. పట్టణంలోని యాదగిరిపల్లి సమీపంలో ప్రయాణిస్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో ఉన్న మిగతా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






