వైట్ సారీలో వావ్ అనిపించిన అనన్య నాగళ్ల.. అందానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్

by Pulgam srinivas |   (  Updated:2026-06-14 10:36:38  IST  )

తెల్ల చీరలో మెరిసిపోయిన అనన్య నాగళ్ల.

వైట్ సారీలో వావ్ అనిపించిన అనన్య నాగళ్ల.. అందానికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: అనన్య నాగళ్ల పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘మల్లేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, తన తొలి చిత్రంలోనే అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

ఆ తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. సినిమాల్లో గ్లామర్ షోకు కాస్త దూరంగా కనిపించే అనన్య నాగళ్ల, సోషల్ మీడియాలో మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఎప్పటికప్పుడు తన అందాలను హైలైట్ చేసే స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచుతోంది. దీంతో రోజురోజుకూ ఈమె సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ట్రెడిషనల్ లుక్ ఫోటోలను పోస్ట్ చేసింది.

తెల్లని చీరలో మెరిసిపోతూ అందుకు తగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ఒక చేతికి స్టైలిష్ వాచ్, వేళ్లకు ఉంగరాలు ధరించి, డిఫరెంట్ డిజైన్ ఇయర్‌రింగ్స్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపించింది.

హెయిర్‌ను సైడ్‌కి అందంగా సెట్ చేసుకోవడంతో ఆమె లుక్‌కు మరింత గ్లామర్ టచ్ వచ్చింది. మొత్తంగా తెల్ల చీరలో అనన్య నాగళ్ల ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: ఇంస్టాగ్రామ్

పింక్ శారీలో ట్రెడిషనల్ అందాలతో మెస్మరైజ్ చేసిన ప్రియ భవాని శంకర్

Next Story