పింక్ శారీలో ట్రెడిషనల్ అందాలతో మెస్మరైజ్ చేసిన ప్రియ భవాని శంకర్

by Pulgam srinivas |

ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయిన ప్రియ భవాని శంకర్.. పింక్ శారీలో అందాల సందడి.

పింక్ శారీలో ట్రెడిషనల్ అందాలతో మెస్మరైజ్ చేసిన ప్రియ భవాని శంకర్
X

దిశ, వెబ్ డెస్క్: బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి ప్రియ భవాని శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం 2017లో విడుదలైన తమిళ చిత్రం ‘మేయాద మాన్’ ద్వారా హీరోయిన్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.



కెరీర్ ప్రారంభంలో వరుసగా తమిళ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రియ భవాని శంకర్ ప్రస్తుతం రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.




సినిమాల్లో క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో ఆకట్టుకునే ఈ భామ సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్‌కు దూరంగా ఉంటూ క్లాస్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరోసారి ట్రెడిషనల్ లుక్‌లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియ భవాని శంకర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన తాజా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.




ఈ ఫోటోలలో ఆమె సిల్వర్ ఎంబ్రాయిడరీ అంచుతో ఉన్న లైట్ పింక్ శారీని ధరించి, అందుకు తగిన బ్లౌజ్‌తో ఎంతో ఎలిగెంట్‌గా కనిపించింది. కొన్ని ఫోటోలలో పింక్ కలర్ హారం ధరించగా, మరికొన్నింటిలో సిల్వర్ హారంతో మరింత స్టైలిష్ లుక్‌లో మెరిసింది.




చేతికి గాజులు, ముందుకు వాలిన కురులు, అందమైన చిరునవ్వుతో ప్రియ ఇచ్చిన స్టిల్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రెడిషనల్ లుక్‌లో ఈ బ్యూటీ సూపర్‌గా కనిపించడంతో, ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story