Aishwarya Rajesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి అందుకే నన్ను తీసుకోవట్లేదేమో?

by Pulgam srinivas |

'సంక్రాంతికి వస్తున్నాం' కంటే మంచి పాత్రను నాతో చేయాలనే అనిల్ ప్రస్తుతం నాతో సినిమా చేయడం లేదేమో అని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.

Aishwarya Rajesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి అందుకే నన్ను తీసుకోవట్లేదేమో?
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ తాజాగా ‘ఓ సుకుమారి’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను నిన్న విడుదల చేశారు. టీజర్ విడుదల కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య రాజేష్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు మీరు నటించిన చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా విజయంలో మీ పాత్ర కూడా కీలకమని చాలామంది ప్రశంసించారు. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాల్లో కూడా మీకు అవకాశం ఇస్తారని భావించారు. కానీ ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న వస్తోంది? అని అడిగారు.

దీనికి స్పందించిన ఐశ్వర్య రాజేష్ సరదాగా మీ దగ్గర అనిల్ గారి నెంబర్ ఉందా? ఉంటే వెంటనే ఫోన్ చేసి అడుగుదాం అంటూ నవ్వులు పూయించింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ, ఈ ప్రశ్న మీరు ఒక్కరే కాదు, చాలామంది నన్ను అడిగారు. అనిల్ గారు కూడా అనేక సందర్భాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో నా వాటా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పారు. ఆయన నాకు ఆ సినిమా తర్వాత అవకాశం ఇవ్వకపోవడానికి కారణం మరింత అద్భుతమైన పాత్ర కోసం ఆలోచిస్తున్నారేమో కావచ్చు అని తెలిపింది. ఇక ప్రస్తుతం అనిల్ గారు వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో సినిమా చేస్తున్నారని, ఆ సినిమా కథ తనకు తెలుసని, ఆ సినిమాతో అనిల్ గారు మరో బ్లాక్‌బస్టర్ అందుకోవడం ఖాయం అని చెప్పుకొచ్చింది.

Next Story