- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే విజయుడు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

దిశ, ఎర్రవల్లి : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం ఎర్రవల్లి మండలం పుటాన్‌దొడ్డి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సర్పంచ్ చిన్న నారాయణ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. అనంతరం గ్రామస్థులు ఎమ్మెల్యే విజయుడిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, ఇటిక్యాల మాజీ జెడ్పీటీసీ హనుమంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రంగారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్ విజయలక్ష్మి, పరుశరాముడు, పరంధామ్‌రెడ్డి, పాపిరెడ్డి, జి. చిన్నయ్య, వార్డు సభ్యులు డోలు మద్దిలేటి, భరత్, సురేందర్ యాదవ్, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






