“నాగబంధం” సినిమా రన్‌టైమ్ లాక్

by Pulgam srinivas |

తాజా అప్‌డేట్ ప్రకారం 'నాగబంధం' రన్‌టైమ్‌ను సుమారు 3 గంటల 15 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

“నాగబంధం” సినిమా రన్‌టైమ్ లాక్
X

దిశ, వెబ్ డెస్క్: పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా నటించిన చిత్రం ‘నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్’ ఈ చిత్రంలో నబా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించగా, అభిషేక్ నామ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ను కూడా మేకర్స్ లాక్ చేసినట్లు సమాచారం.

తాజా అప్‌డేట్ ప్రకారం ఈ చిత్ర రన్‌టైమ్‌ను సుమారు 3 గంటల 15 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రన్‌టైమ్ కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ గ్రాఫిక్స్ సన్నివేశాలు మరియు విస్తృతమైన కథాంశం కారణంగా కథను సమగ్రంగా చెప్పడానికి ఈ సమయం అవసరమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇంత పొడవైన రన్‌టైమ్ వల్ల సినిమా కొంత బోర్ అనిపిస్తే నెగటివ్ ప్రభావం పడే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Next Story