- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాపర్ విద్యార్థినికి సర్పంచ్ చేయూత.. సభలోనే రూ.10 వేల ఆర్థిక సాయం
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇన్‌ఫాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రతిభకు సన్మానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కారేపల్లి సర్పంచ్ మేదరి టోనీ వీర ప్రతాప్ పాల్గొన్నారు.

దిశ, కారేపల్లి: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇన్‌ఫాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రతిభకు సన్మానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కారేపల్లి సర్పంచ్ మేదరి టోనీ వీర ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని మమత తన కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి వివరించగా సర్పంచ్ భావోద్వేగానికి గురయ్యారు. తన చిన్ననాటి పేదరికాన్ని గుర్తు చేసుకున్న ఆయన, విద్యార్థిని చదువుకు అండగా నిలుస్తానని ప్రకటించారు. మమత తండ్రి శ్రీనివాస్ కోమట్లగూడెంకు చెందిన వారు. ఆమె పదో తరగతిలో 548 మార్కులు సాధించి మండల స్థాయిలో జడ్పీహెచ్‌ఎస్ టాపర్‌గా నిలిచింది.
ఇటీవల రవీంద్రభారతిలో నిర్వహించిన బీసీ వెల్ఫేర్ శాఖ కార్యక్రమంలో కూడా ఆమె సత్కారం అందుకుంది. విద్యార్థిని సాధించిన విజయాలను తెలుసుకున్న సర్పంచ్ మేదరి వీరప్ ప్రతాప్ సభలోనే రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అందజేశారు. చదువుకు పేదరికం అడ్డుకాదు లక్ష్యసాధన కోసం విద్యార్థులు కష్టపడి చదవాలి’ అని ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ సర్పంచ్ చేసిన సహాయం పై పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి, భూక్యాకర్ణ రీజనల్ కార్యదర్శి మూత్త బోయిన శ్రీనివాస్, దస్తగిరి, శ్రీనివాస్, డివిజన్ క్లబ్ సభ్యులు, వీరస్వామి భాస్కర్, ఉపాధ్యాయులు, మండలంలోని ప్రతిభ కనబరిచిన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






