- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్ కలెక్టర్లు, కరోబార్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి సీతక్క
by Taduka Kalyani |
గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు.

X
దిశ, కొండపాక: గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. ఆదివారం ప్రగతి భవన్‌లో తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బిల్ కలెక్టర్లు, కరోబార్ల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగుల జీతాలను పెంచి, ప్రతి నెలా నేరుగా వారి శాలరీ అకౌంట్లలోనే జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల నర్సింహులు, పిల్లి రవి యాదవ్,మేకల శ్రీధర్ , నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Next Story






