కరువు పనిలో కళ్యాణం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

by Jakkula.Mamatha |

కరువు పని కూలీలు పని అనంతరం సరదాగా కళ్యాణం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కరువు పనిలో కళ్యాణం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
X

దిశ,రాజపేట: కరువు పని కూలీలు పని అనంతరం సరదాగా కళ్యాణం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన కరువు పని కూలీలు పని కోసం తెచ్చిన తట్టాల బాజా భజంత్రీల మధ్య తంగేడు పూలు, ఎరుపు కాగితాల పూలతో, మామిడి తోరణాల మధ్య కళ్యాణం చూడముచ్చటగా చేసుకున్న వీడియో ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. అడవిలో దొరికే ఆకులు పూలతో అలంకరణ కనువిందు చేసింది. ఆ వీడియో లైక్‌లతో కామెంట్లతో తెగ వైరల్ అవుతున్నది.

వీడియో

Next Story