చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి..

by Kodari Anjali |

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో జరిగింది.

చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి..
X

దిశ, సైదాపూర్: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గొడిశాల, ఎల్లంపల్లి, గుజ్జులపల్లి గ్రామాలకు సంబంధించిన పెద్ద చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యకారులు వెళ్లారు. మత్స్యకారులంతా చెరువులో వేరువేరుగా చేపలు పడుతుండగా గూల్ల శ్రీనివాస్ (45) అనే మత్స్యకారుడు చెరువులో చేపలు పడుతూ.. మునిగిపోయి కనిపించకపోవడంతో తోటి మత్స్యకారులు చెరువులో వెతకగా నీటిలో మునిగి ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని బయటకు తీసి ఒడ్డుకు చేర్చారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.

Next Story