Viral : ప్రాణం తీసిన బంగీ జంప్

by Naga Rani Yarlagadda |

బంగీ జంప్ చేయాలన్న ఓ యువతి కోరికే ఆమె ప్రాణాన్ని బలితీసుకుంది.

Viral : ప్రాణం తీసిన బంగీ జంప్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే బంగీజంప్ వీడియోలు చూస్తే.. ఒక్కసారైనా ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ సాహసం చేయాలని చాలామందికి అనిపిస్తుంటుంది. అలా ఎప్పటి నుంచో బంగీ జంప్ చేయాలనుకుంటున్న ఓ యువతి.. ఆ స్టంట్ కారణంగానే ప్రాణాలు కోల్పోయింది. ఇందుకు పూర్తిగా ఆ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని వైరల్ అవుతున్న వీడియో చూసిన ప్రతిఒక్కరికీ అర్ధమవుతోంది. యువతికి సేఫ్టీరోప్ టై చేయకుండానే 40 మీటర్ల ఎత్తు నుంచి కిందికి తోసేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బ్రెజిల్ లోని లైమీరాలో శనివారం చోటుచేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్ సావో పాలోకు చెందిన మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21)అడ్వెంచర్ గేమ్స్ లో పాల్గొనేందుకు తన ఫ్రెండ్స్ తో కలిసి లైమీరా అనే ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బంగీజంప్ కు వెళ్లిన ఫ్రీటాస్ కాళ్లకు నిర్వాహకులు సేఫ్టీ రోప్ కట్టడం మరిచిపోయారు. యువతిని అలాగే కిందికి తోసివేయడంతో.. తీవ్రగాయాలతో ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, నిర్వాహకుల వైఫల్యమే కారణమని తేల్చారు. బాధ్యులైన ఆరుగురు సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజన్లు నిర్వాహకులపై ఫైరవుతున్నారు.

Next Story