రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ అయిపోయింది: KTR

by Ajay Maddhiboyina |

సినిమా రిజ‌ల్ట్ ట్రైల‌ర్ చూసి హిట్టా..ఫ‌ట్టా అన్న‌ది చెప్పార‌ని, రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఇంట‌ర్ వెల్ కూడా అయిపోయింద‌ని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇంటర్వెల్ అయిపోయింది: KTR
X

దిశ‌, వెబ్ డెస్క్: సినిమా రిజ‌ల్ట్ ట్రైల‌ర్ చూసి హిట్టా..ఫ‌ట్టా అన్న‌ది చెప్పార‌ని, రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వానికి ఇంట‌ర్ వెల్ కూడా అయిపోయింద‌ని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖైర‌తాబాద్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఫ‌స్టాఫ్ డిజాస్ట‌ర్ అని హైద‌రాబాద్ లో ఒక్క ఇల్లు కూడా క‌ట్ట‌లేద‌ని విమ‌ర్శించారు. క‌ట్టిన ఇళ్ల‌ను కూడా కూల్చేశార‌ని అన్నారు. సొంత పార్టీ వాళ్ల‌నే రేవంత్ రెడ్డి మోసం చేశార‌ని ఆరోపించారు. రేవంత్ అవినీతిపై మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాహుల్ గాంధీకి రిపోర్ట్ ఇచ్చార‌ని చెప్పారు. అందుకే ప‌గ‌బ‌ట్టి మీనాక్షిపై దొంగ కేసు పెట్టించార‌న్నారు. మీనాక్షి న‌ట‌రాజ‌న్ మ‌ధ్య ప్ర‌దేశ్ లో నామినేష‌న్ వేస్తే, బీజేపీ వాళ్ల‌కు కేసు విష‌యం చెప్పార‌ని ఆరోపించారు.

ఆమెను రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌కుండా రేవంత్ రెడ్డి అడ్డుకున్నార‌ని అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న‌పై తీవ్ర అసంతృప్తి నెల‌కొంద‌ని అన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని ఆ హామీని కూడా అమ‌లు చేయ‌కుండా య‌వ‌త‌ను మోసం చేశార‌ని ఆరోపించారు. కేసీఆర్ హ‌యాంలో రూ.5కే భోజ‌నం పేరుతో ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చామ‌ని, కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర‌వాత దాని పేరు ఇందిర‌మ్మగా మార్చార‌ని విమ‌ర్శించారు.

Next Story