- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖ ఎయిర్ పోర్టును మూసివేయవద్దు: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం ఎయిర్‌పోర్టును మూసివేయకుండా దేశీయ సర్వీసులను అక్కడి నుండే కొనసాగించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఎయిర్ పోర్టును మూసివేయవద్దు అని కేంద్ర మంత్రి ఇందులో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే బోగాపురం ఎయిర్ పోర్టులో ఉత్తరాంద్ర వాసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, దీంతో ఉత్తరాంధ్ర యువతకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. అలాగే వారికి ఉత్తరాంధ్ర వాళ్లు అంటే ఎందుకంత వివక్ష అని, విశాఖ ఎయిర్ పోర్టును మూసేయొద్దని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విజ్ఙప్తి చేశారు. అలాగే భోగాపురం, విశాఖలోను విమాన సర్వీసులను కొనసాగించాలని, అంతర్జాతీయ విమానాలు భోగాపురం నుంచి నడపాలని, దేశీయ సర్వీసులు, విశాఖ నుంచి నడపాలని, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలని కోరారు. అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్ పై ఎవరూ మాట్లాడటం లేదని, మాట్లాడితే సీటు పోతుందేమోనని బయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకోవాలి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను (International Flights) భోగాపురం నుండి నడుపుతూనే.. దేశీయ సర్వీసులను (Domestic Flights) విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుండే యథావిధిగా కొనసాగించేలా ప్లాన్ చేయాలని కోరారు.






