లండన్‌లో భారత సంతతి యువకుడి దారుణ హత్య

by Ajay Maddhiboyina |

తాజాగా లండ‌న్ లో భార‌తీయ సంత‌తికి చెందిన వ్య‌క్తిని దారుణంగా హ‌త‌మార్చారు. ప‌శ్చిమ లండ‌న్‌లోని సౌత్ హాల్ ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. అయితే ఈ హత్యరకు కారణం ఏంటి అనే వివరాలు ఇంకా నిర్దారించలేదు.

లండన్‌లో భారత సంతతి యువకుడి దారుణ హత్య
X

దిశ‌, వెబ్ ఎస్క్: ఇటీవ‌ల కాలంలో విదేశాల్లో భారతీయుల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా జాత్యహంకార దాడులకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం అమెరికాలో ఓ చోట భారతీయులు ఫోటో దిగుతుంటే ఈ దేశానికి ఎందుకు వచ్చారు అంటూ ఓ వ్యక్తి వారిని ప్రశ్నించాడు. ఇక్కడ నుండి వెళ్లిపోండి అంటూ దూషించాడు. ఇది జరిగిన కొద్దిరోజులకే అమెరికాలో ఓ మాల్ లో మ‌హిళ‌ను హ‌త్య చేయ‌గా, రీసెంట్ గా తెలంగాణ‌కు చెందిన యువ‌కుడిని సైతం క‌త్తితో పొడిచి హ‌త‌మార్చారు. ఇప్పుడు తాజాగా లండ‌న్ లో భార‌తీయ సంత‌తికి చెందిన వ్య‌క్తిని దారుణంగా హ‌త‌మార్చారు. ప‌శ్చిమ లండ‌న్‌లోని సౌత్ హాల్ ప్రాంతంలో పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల గుర్భేజ్ సింగ్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. అయితే ఈ హత్యరకు కారణం ఏంటి అనే వివరాలు ఇంకా నిర్దారించలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన మెట్రోపాలిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యతో విదేశాల్లో భారతీయుల భద్రతపై మరోసారి ఆందోళన మొదలైంది.

Next Story