- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కార్ స్కూళ్లు.. జొన్నల సంచులమయం...
నూతన విద్యా సంవత్సరం సోమవారం నుంచి ఆరంభం కానున్న తరుణంలో మండల కేంద్రమైన రేగోడ్ లోని ప్రభుత్వ బడులు అపరిశుభ్రతతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి.

దిశ,రేగోడ్: నూతన విద్యా సంవత్సరం సోమవారం నుంచి ఆరంభం కానున్న తరుణంలో మండల కేంద్రమైన రేగోడ్ లోని ప్రభుత్వ బడులు అపరిశుభ్రతతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కొత్త తరగతుల్లోకి ఆనందోత్సవాలతో అడుగు పెట్టాల్సిన పిల్లలకు స్థానిక ప్రాథమిక, ఉన్నత పాఠశాల ఆవరణలు ఆదివారం నాటికి అధ్వాన్నపు పరిస్థితులతోనే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న జొన్నల సంచులను హై స్కూల్ వరండాలు, ప్రాథమిక పాఠశాల, హై స్కూల్ గ్రౌండ్లలో నిల్వ ఉంచారు. వాటిని తరలించే ఏర్పాటు చేయని కారణంగా పాఠశాలలు జొన్న ల సంచులతో నిండుకుని ఉన్నాయి. ఒక వైపు వర్షం కురుస్తుండడంతో రెైతులు కష్టపడి పండించుకున్న జొన్న లు తడిసిపోతున్నాయి. నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు సంచుల నిల్వలతో బడుల పరిసరాలు అపరిశుభ్రంగా తయారయ్యాయి. ఇలాంటి ఆద్వాన్నపు స్థితిలో స్కూళ్ల ఆరంభం ఏ విధంగా కొనసాగిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరాన్ని చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో మొదలు పెట్టాల్సి ఉండగా చెత్తతో తరగతులను ఆరంభిస్తే తమ పిల్లలకు ఎలా ఆసక్తి కలుగుతుందని నిలదీస్తున్నారు. మరి సంబంధిత అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారో చూడాలి మరి...






