గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టిన ‘మర్రి కింద ముచ్చట్లు’.. ఘనంగా పుస్తక ముఖచిత్ర ఆవిష్కరణ!

by Jakkula.Mamatha |

గ్రామీణ సంస్కృతికి అచ్చుగుద్దినట్టు అద్దం పట్టినట్టుగా “మర్రి కింద ముచ్చట్లు” పుస్తక రచన కొనసాగిందని పలువురు సాహితీవేత్తలు కొనియాడారు.

గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టిన ‘మర్రి కింద ముచ్చట్లు’.. ఘనంగా పుస్తక ముఖచిత్ర ఆవిష్కరణ!
X

దిశ,తుంగతుర్తి: గ్రామీణ సంస్కృతికి అచ్చుగుద్దినట్టు అద్దం పట్టినట్టుగా “మర్రి కింద ముచ్చట్లు” పుస్తక రచన కొనసాగిందని పలువురు సాహితీవేత్తలు కొనియాడారు. మండలంలోని తూర్పుగూడెం గ్రామ నివాసి, సాఫ్ట్ వేర్ గనగాని రాజు రచించిన “మర్రి కింద ముచ్చట్లు” పుస్తక ముఖ చిత్రాన్ని ఆదివారం తుంగతుర్తి సాహితి వేదిక ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి, సాహితీవేత్త గుండగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రముఖ రచయిత, కవులు, సాహితీవేత్తలైన డాక్టర్ ఎర్ర హరికృష్ణ, గుడిపాటి సైదులు, తాటికొండ సీతయ్య, గుండగాని రాములు మాట్లాడుతూ.. పుస్తక రచయిత గ్రామీణ పాత కాలం నాటి సంస్కృతి, సంప్రదాయాలు అన్నింటినీ క్రోడీకరించి ఒక మహత్తర ఘట్టంగా పుస్తకాన్ని మలిచారని కొనియాడారు.

అయితే ఆ చెట్టు అంతరించిపోయి నేడు కొత్తగా పుట్టుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతకాల వైభవం కనుమరుగైందన్నారు. కవులు తుంగతుర్తి ఖ్యాతిని ఖండాంతరాల్లో నిలపడం మరో విశేష ఘట్టమని పేర్కొన్నారు. రచయిత గనగాని రాజు మాట్లాడుతూ.. తన స్వగ్రామమైన తూర్పు గూడెం ప్రవేశం ముందే ఉన్న మర్రిచెట్టు, మంచినీళ్ళ బావి వద్ద అన్ని వర్గాల వారి ముచ్చట్లు, చిన్నతనంలో నెలకొన్న గ్రామీణ సంస్కృతి వీటన్నింటితో పుస్తక రచనపై ప్రేరణ కలిగిందని పేర్కొన్నారు. సమావేశంలో తాళ్లపల్లి సోమన్న, గుండగాని రామకృష్ణ, తొట్ల మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story