- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను జైలుకు పంపాలి: ఆకునూరి మురళి
హైదరాబాద్‌లో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి కేంద్రంపై విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు హైదరాబాద్ ధర్నా చౌక్‌లో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు, సీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణలోని ప్రముఖలు, ప్రొఫెసర్లు, కీలక నేతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి పాల్గోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో కనీసం ఒక పరీక్షను కూడా పారదర్శకంగా నిర్వహించలేని సన్యాసులు పాలన సాగిస్తున్నారని, కేంద్ర కేబినెట్ లంచగొండితనం, మూర్ఖత్వం వల్లే ప్రతి ఏటా పేపర్లు లీక్ అవుతూ విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందని మండిపడ్డారు. దేశద్రోహులను, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను స్వయంగా ప్రధాని మోడీనే వెనకేసుకొస్తున్నారని ఆరోపించిన ఆయన, ఈ ప్రభుత్వంలోని అధికారులు, జడ్జీలు అంతా ఒక దొంగల ముఠాగా తయారయ్యారని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు.
గడిచిన 12 ఏళ్ల మోడీ పాలనలో పేదలకు ఎలాంటి న్యాయం జరగలేదని, దేశ ప్రజల సంపదను ఎటు తీసుకుపోతున్నారని ఈ సందర్భంగా మురళి నిలదీశారు. దేశంలో నాణ్యమైన విద్యను ఇవ్వలేని దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొందని, డిగ్రీ చదివిన పిల్లల్లో కేవలం 6 శాతం మందికే నైపుణ్యాలు ఉంటే మిగతా 94 శాతం మంది విద్యార్థుల గతి ఏంటని ప్రశ్నించారు. ఈ దేశవ్యాప్త కుంభకోణానికి బాధ్యుడైన ధర్మేంద్ర ప్రధాన్ కేవలం రాజీనామా చేస్తే సరిపోదని, ఆయనను వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నందుకు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడాలని ఈ సందర్భంగా ఆకునూరి మురళి డిమాండ్ చేశారు.






