- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
by Batti.Sumithra |
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి గ్రామంలో కడారి సమ్మయ్య (70) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

X
దిశ, భూపాలపల్లి ప్రతినిధి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లి గ్రామంలో కడారి సమ్మయ్య (70) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సమ్మయ్య శనివారం రాత్రి ఇంటి వెనుక భాగంలో ఉన్న మేకల మంద వద్ద కాపలా కోసం పడుకున్నాడు. అయితే ఆదివారం తెల్లవారేసరికి ఆయన మృతదేహంగా కనిపించాడు. మరణం అనుమానాస్పదంగా ఉందని భావించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, మృతికి గల కారణాల పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Next Story






