దర్శకుడు సరిగ్గా లేకపోతే నటీనటులు ఎంత కష్టపడినా వేస్టే.. మాళవిక మోహనన్ సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

దర్శకుడు సరిగ్గా లేకపోతే నటీనటులు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదని, మంచి దర్శకుల వల్లే తనకు నటిగా మంచి గుర్తింపు వచ్చిందని తెలిపింది.

దర్శకుడు సరిగ్గా లేకపోతే నటీనటులు ఎంత కష్టపడినా వేస్టే.. మాళవిక మోహనన్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. భారీ ప్రాజెక్ట్స్‌లో నటించే చాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. గత ఏడాది ‘హృదయపూర్వం’ చిత్రంలో తనకంటే వయసులో 34ఏళ్ల పెద్దవారైన మోహన్‌లాల్ సరసన నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె కోలీవుడ్‌లో ఓ రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తాజాగా, ఓ షాపింగ్ ఫెస్టివల్ లాంచ్‌లో పాల్గొన్న మాళవిక తను నటిస్తున్న సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కార్తీ హీరోగా, పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్దార్-2’ మూవీ తనకు చాలా ప్రత్యేకమైనదని మాళవిక తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర శారీరకంగా ఎంతో సవాలుతో కూడుకున్నదని, ఇందులో తను నమ్మశక్యం కాని భారీ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు చేసినట్లు వెల్లడించింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వెండితెరపై చూడటానికి తను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

అలాగే విలక్షణ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా ఏడేళ్ల తర్వాత చేస్తున్న ‘పాకెట్ నోవెల్’ సినిమాలో భాగమవ్వడం తన అదృష్టమని మాళవిక ఆనందం వ్యక్తం చేసింది. ఆయనతో కలిసి పని చేయాలనేది తన విష్‌లిస్ట్‌లో ఉందని పేర్కొంది. అలాగే, విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న మూడో చిత్రం ఇదని.. అయితే గతంలో పేట, మాస్టర్ చిత్రాల్లో ఇద్దరం ఉన్నప్పటికీ, కలిసి నటించే సీన్లు మాత్రం ఈ ‘పాకెట్ నోవెల్’లోనే కుదిరాయని చెప్పింది. షూటింగ్ సెట్స్‌లో తామిద్దరం ఈ విషయం మాట్లాడుకున్నప్పుడు.. ‘పేట’లో ఇద్దరం ఉన్నామనే విషయాన్ని విజయ్ సేతుపతి మర్చిపోయారని, ప్రస్తుతం ఆయన తమ కుటుంబ స్నేహితుడిగా మారిపోయారని మాళవిక చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మాజిద్ మాజిది, లోకేష్ కనకరాజ్, పా రంజిత్ వంటి టాప్ డైరెక్టర్లతో పనిచేసిన మాళవిక.. తాను ఎప్పుడూ కథలను ఆచితూచి ఎంచుకుంటానని చెప్పింది. దర్శకుడు సరిగ్గా లేకపోతే నటీనటులు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదని, మంచి దర్శకుల వల్లే తనకు నటిగా మంచి గుర్తింపు వచ్చిందని తెలిపింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ నెట్టింట సంచలనంగా మారాయి.

Next Story