- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > దారి దోపిడి కేసులో ముగ్గురు నిందితులకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
దారి దోపిడి కేసులో ముగ్గురు నిందితులకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష
by Kodari Anjali |
దారిదోపిడీ కేసులో ముగ్గురు నిందితులకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

X
దిశ, కార్వాన్: దారిదోపిడీ కేసులో ముగ్గురు నిందితులకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన ఘటన కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది (14-04-2025) జియాగూడ 100 ఫీట్ రోడ్డు వద్ద మహ్మద్ ముబీన్ (ఏ1), మహ్మద్ ముజఫర్ అలీ ఖాన్ (ఏ2), మహ్మద్ షాఫైజ్ పటేల్ (ఏ3) ముగ్గురు కలిసి కత్తితో బెదిరించి మొబైల్, రూ. 5,000 దోచుకువెళ్ళారు. నేరం రుజువు కావడంతో హైదరాబాద్ XVI ఏ సి జె ఎం న్యాయమూర్తి జి. ప్రభాకర్ ముగ్గురు నిందితులకు 2 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధించారు. పక్కా సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చేసిన ఇన్ స్పెక్టర్ ఎమ్. వరప్రసాద్, ప్రాసిక్యూషన్ బృందాన్ని కుల్సుంపుర ఇన్‌స్పెక్టర్ ఎ. రాములు అభినందించారు.
Next Story






