- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరూర్‌నగర్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్..
గంజాయి తరలిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

దిశ, చైతన్యపురి: గంజాయి తరలిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11 సాయంత్రం సరూర్‌నగర్‌లోని ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ లేన్ సమీపంలో తాము వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో టి ఎస్ 07 యుఎన్ 7191 నంబరు గల ఎస్-ప్రెస్సో కారును తనిఖీ చేయగా బొంత ప్రకాష్, పాపని రవి అక్రమ విక్రయాల నిమిత్తం గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు. వారి వద్ద నుండి మొత్తం 22.29 కిలోగ్రాముల గంజాయి (వాణిజ్య పరిమాణం) స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు, రెండు మొబైల్ ఫోన్లను, మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన సొమ్ముగా అనుమానిస్తున్న రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం జరిపిన విచారణలో నిందితులిద్దరు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాబురావు అనే వ్యక్తి నుండి సేకరించి అక్రమ లాభం కోసం హైదరాబాద్‌లోని జావేద్‌కు విక్రయించేందుకు తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఇందులో ప్రమేయం బాబురావు, జావీద్ ల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు తమకు సమాచారం అందించాలని సీఐ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.






