- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకినాడ రూరల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పొలాల మధ్య చెలరేగిన మంటలు
by Vemula.Srinu Prasad |
కాకినాడ రూరల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పొలాల మధ్య మంటలు చెలరేగాయి. దీంతో చుట్టూ ప్రాంతాలకు పొగ దట్టంగా అలుముకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: కాకినాడ రూరల్(Kakinada Rural)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. పొలాల మధ్య మంటలు చెలరేగాయి. దీంతో చుట్టూ ప్రాంతాలకు పొగ దట్టంగా అలుముకుంది. మరోవైపు అకస్మాత్తుగా ఏమీ అర్ధంగాని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడాన్ని చూసిన స్థానికులు గందరగోళానికి గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని వాళ్లు మంటలార్పారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైతులే ఎండిపోయిన పంటలకు నిప్పు పెట్టడంతో అంతగా మంటలు చెలరేగాయా..?. లేదా గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే మంట పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






