వైభవ్ సూర్యవంశీ సచిన్, కోహ్లీలను మించిపోతాడు.. డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

వైభవ్ సూర్యవంశీ సచిన్, కోహ్లీలను మించిపోతాడని డేల్ స్టెయిన్ జోస్యం చెప్పారు. అయితే ఈ 15 ఏళ్ల వండర్ కిడ్ కెరీర్‌ను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.

వైభవ్ సూర్యవంశీ సచిన్, కోహ్లీలను మించిపోతాడు.. డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో సంచలనంగా మారిన వైభవ్ సూర్య వంశీ (Vaibhav Surya Vamsi) భారత జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలసిందే. ఈ క్రమంలో అతని ప్రతిభ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ క్రికెటర్లు స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ప్రోగ్రాం కి ఇచ్చిన వర్చువల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీపై దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ (Dale Stein) ప్రశంసల వర్షం కురిపించారు.

ఎస్ఏ 20 (SA20) సీజన్-5 ప్రమోషన్ల నేపథ్యంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఈ అద్భుత బాలుడు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల కంటే గొప్ప స్థాయికి చేరుకుంటాడంటూ అత్యంత ప్రతిష్టాత్మకమైన అంచనా వేశారు. వైభవ్ సూర్యవంశీ సరికొత్త రకం ఆటగాడని, ప్రస్తుతం ఉన్న చాలామంది అంతర్జాతీయ క్రికెటర్ల కంటే అతనే ఎంతో మెరుగ్గా ఆడుతున్నాడని కొనియాడారు. అతను భారత క్రికెట్‌కు దొరికిన ఒక అద్భుతమైన నిధి అని, కెరీర్ ముగిసే సమయానికి సచిన్, కోహ్లీ ఇద్దరినీ కలిపినా వారి కంటే పెద్ద స్టార్ అవుతాడని స్టెయిన్ జోస్యం చెప్పారు.

అయితే, ఇదే సమయంలో బీసీసీఐ, భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు స్టెయిన్ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా చేశారు. ఇంత చిన్న వయసులోనే విపరీతమైన స్టార్‌డమ్, అంచనాలు వస్తున్నందున, అతని సుదీర్ఘ కెరీర్ అభివృద్ధి కోసం అతనిని చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా మేనేజ్ చేయాలని సూచించారు. అలా చేయకపోతే ఇంతటి గొప్ప ప్రతిభావంతుడిని మధ్యలోనే నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యువ సంచలనంపై ప్రపంచ క్రికెట్ దిగ్గజం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story