హైదరాబాద్‌లో డ్రగ్స్ డెన్‌పై ఈగల్ అటాక్..

by Kodari Anjali |

ఈగల్ మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా పై పంజా విసిరింది.

హైదరాబాద్‌లో డ్రగ్స్ డెన్‌పై ఈగల్ అటాక్..
X

దిశ, సిటీ క్రైం: ఈగల్ మరో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాపై పంజా విసిరింది. హైదరాబాద్ బాట సింగారంలో తయారు చేస్తున్న మేఫిడ్రోన్ డ్రగ్స్‌‌ను ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఇంకా కొన్ని దేశాలకు ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారని తెలిసింది. ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన కరుడు గట్టిన క్రిమినల్స్ ఈ మేఫిడ్రోన్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు తేలింది. గతంలో ఈ గ్యాంగ్ హైదరాబాద్‌లో పలు హత్యలు, బంగారం దోపిడీలకు కూడా పాల్పడ్డారని పోలీసుల విచారణలో బయటపడింది. కీసరి మత్స్యగిరి, నరేష్‌లను అరెస్ట్ చేసి రూ. 50 లక్షల విలువ చేసిన డ్రగ్స్‌ను ఈగల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రధాన సూత్రధారులు ఇతర రాష్ట్రాల్లోని జైలులో ఉన్నారని ఈగల్ పోలీసులు చెప్పారు.

Next Story