హిట్ కోసం ట్రాన్స్‌జెండర్ పాత్రలో రవితేజ.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్!

by Mallepaka Hamsa |

ఈ సినిమాలో ఆయన ఒక ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించనున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.

హిట్ కోసం ట్రాన్స్‌జెండర్ పాత్రలో రవితేజ.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్!
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ ఇటీవల నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఇక ఇటీవల వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో ‘ఇరుముడి’ అనే విభిన్నమైన ఎమోషనల్ అండ్ డివోషనల్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు, ‘రాజా రాజా చోర’ ఫేమ్ యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ ఒక భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంతో ఎలాగైనా ఒక సాలిడ్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్న రవితేజ, కెరీర్‌లో ఎప్పుడూ చేయని ఒక సరికొత్త ప్రయత్నం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో ఆయన ఒక ట్రాన్స్‌జెండర్ పాత్రలో కనిపించనున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు హసిత్ గోలి గతంలో శ్రీవిష్ణుతో తీసిన ‘శ్వాగ్’ సినిమాలో కూడా ట్రాన్స్‌జెండర్ల అంశాన్ని టచ్ చేశారు. అందుకే రవితేజతో చేయబోయే సినిమాలో కూడా అలాంటి ఒక పవర్‌ఫుల్ ప్రయోగాత్మక పాత్రను డిజైన్ చేసి ఉంటారని టాక్. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ చిత్రానికి ‘అక్కాయిలు బాగున్నారా?’ అనే వెరైటీ టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ ట్రాన్స్‌జెండర్ పాత్రకు సంబంధించిన వార్తలపై ఇప్పటివరకు చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో కొందరు ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు మాత్రం సోషల్ మీడియాలో చర్చరు దారితీస్తున్నాయి.

Next Story