- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్ తో స్వీపర్ మృతి
ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

దిశ, రాజేంద్రనగర్ : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన భూక్యా మిట్యా (54) పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్ పూర్ మాజిస్టిక్ అపార్ట్మెంట్ లో స్వీపర్ గా పనిచేస్తున్నాడు. అదే అపార్ట్మెంట్లో దర్గా ఖలీజ్ ఖాన్ కు చెందిన గొల్లపల్లి శ్రీనివాస్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాను. శుక్రవారం అపార్ట్మెంట్ కు సంబంధించిన ఫ్లెక్సీ బోర్డును కిస్మత్ పూర్ రహదారిపై ఇద్దరు కలిసి ఓ భారీ నిచ్చెన సహాయంతో ఏర్పాటు చేస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన 11 కె.వి తీగలకు తగిలింది. దీంతో భూక్య మిట్యాకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కింద పడిపోయాడు. శ్రీనివాస్ కింద ఉండడంతో పక్కకు పడిపోయాడు. వెంటనే స్థానికులు తీవ్ర గాయాలకు గురైన భూక్య మిట్యాను మెడి లైఫ్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ భూక్య మిట్యా మృతి చెందాడు. శ్రీనివాస్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అపార్ట్మెంట్ యజమాని అప్రమత్తం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






