పట్నాయక్ అద్భుతం.. ‘రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026’ కైవసం

by Malleboina Mahesh |

రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఇసుక శిల్పాల ఉత్సవంలో ప్రముఖ భారతీయ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ‘రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026’ గెలుచుకున్నారు.

పట్నాయక్ అద్భుతం.. ‘రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026’ కైవసం
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ కు చెందిన శాండ్ ఆర్టీస్ట్.. సుదర్శన్ పట్నాయక్.. రష్యాలో చరిత్ర సృష్టించారు. ‘రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026 కప్ గెలుచుకొని.. తొలి భారతీయుడిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కారు. ప్రపంచ ప్రసిద్ధ ఇసుక శిల్పి (Sand Artist) సుదర్శన్ పట్నాయక్ అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేయడంతో ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని కలినిన్‌గ్రాడ్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘2వ అంతర్జాతీయ ఇసుక శిల్పాల ఉత్సవం’ (II International Festival of Sand Sculpture) లో ఆయన "రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026" ను కైవసం చేసుకున్నారు. ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకున్న మొట్టమొదటి భారతీయ ఇసుక శిల్పిగా సుదర్శన్ పట్నాయక్ సరికొత్త చరిత్ర సృష్టించారు.

పర్యావరణ సందేశంతో ప్రపంచాన్ని మెప్పించిన శిల్పం

ఈ చారిత్రాత్మక విజయంపై సుదర్శన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేస్తూ.. "ఒక కళాకారుడిగా ఈ కప్‌ను గెలవడం నాకు లభించిన అతిపెద్ద గౌరవం. ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న వాతావరణ మార్పులు (Climate Change), వాటి ప్రభావాలు, వాటిని అరికట్టేందుకు మనం చేయాల్సిన పనులను ప్రతిబింబిస్తూ నేను రూపొందించిన ఇసుక శిల్పానికి ఈ అవార్డు దక్కడం గర్వంగా ఉంది. నా శిల్పాల ద్వారా సమాజానికి ఎల్లప్పుడూ ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికే నేను ప్రయత్నిస్తాను. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు, నిర్వాహకులకు, నాకు నిరంతరం మద్దతు ఇస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని పేర్కొన్నారు.

Next Story