ఆఫర్ల కోసం వెయిట్ చేస్తే మీ జేబుకు చిల్లే.. భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు

by Naga Rani Yarlagadda |

కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి.

ఆఫర్ల కోసం వెయిట్ చేస్తే మీ జేబుకు చిల్లే.. భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ విషయం నేను చెప్పట్లేదు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ కో ఫౌండర్, సీఈఓ కార్ల్ పీ చెప్పారు. ఏఐ నుంచి డిమాండ్ పెరగడంతో మెమొరీ చిప్స్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దీని ఎఫెక్ట్ 2026 మొత్తం మొబైల్ మార్కెట్ పై ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో వరుస పోస్టులు చేశారు. స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో రాబోతున్న పెను మార్పులను వివరించారు. గడిచిన దశాబ్దకాలంగా డిస్ ప్లేలు, మెమొరీ చిప్స్ ధరలు క్రమంగా తగ్గుతూ రావడంతో కంపెనీలు తక్కువ ధరలకే బెటర్ ఫీచర్లతో ఫోన్లను అందించాయని, కానీ ఇప్పుడా ట్రెండ్ పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలు తమ ఏఐ అవసరాల కోసం సెమీకండక్టర్లు, మెమొరీ ప్రొడక్షన్ కెపాసిటీని కొన్నిసంవత్సరాల ముందే బుక్ చేసుకుంటున్నాయని, ఫలితంగా స్మార్ట్ ఫోన్ల తయారీదారులకు మెమొరీ చిప్స్ కొరత పెరిగిందని వెల్లడించారు.

కొన్ని రకాల మెమొరీ చిప్స్ ధరలు ఏకంగా 300 శాతం పెరిగాయని, గతంలో ఫోన్ తయారీ ఖర్చులో ప్రాసెసర్, డిస్ ప్లేలు ఖరీదైతే.. ఇప్పుడు మెమొరీ చిప్స్ రేట్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఏడాది క్రితం వరకూ ఫోన్ ను తయారు చేయాలంటే మెమొరీ కోసం రూ.1900 ఖర్చయితే.. ఏడాది చివరి నాటికి ప్రీమియం ఫోన్లలో మెమొరీ కోసమే రూ.9500 కంటే ఎక్కువ ఖర్చవుతోందన్నారు. ఒక ఫోన్ హార్డ్ వేర్ ఖర్చులో 50 శాతం కంటే ఎక్కువన్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల కంపెనీలు ధరలు పెంచాలా లేక ఫీచర్లు తగ్గించాలా అని సందిగ్ధంలో పడినట్లు కార్ల్ పేర్కొన్నారు. ధరలు పెంచాలంటే.. 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచాల్సి ఉంటుందని, లాభాలు తగ్గకుండా ఉండాలంటే ర్యామ్, స్టోరేజీ వంటివి తగ్గించాలని యోచిస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లాంచ్ అయిన కొన్ని ఫోన్ల రేట్లు.. పాత మోడల్స్ కంటే వంద డాలర్ల మేర పెరిగాయన్నారు. సేల్స్ సీజన్లలో కూడా ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లేకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కార్ల్ పీ అభిప్రాయపడ్డారు. సో.. కొత్త ఫోన్ ను సేల్స్ ఆఫర్లో కొనాలని వెయిట్ చేస్తే.. ఎక్కువ భారం మోయక తప్పదని నథింగ్ సీఈఓ హెచ్చరించారు.

Next Story