తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల

by Gantepaka Srikanth |   (  Updated:2026-06-12 10:43:24  IST  )

తెలంగాణ ఐసెట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి.

తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఐసెట్ ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డుని పొందొచ్చని ఉన్నతాధికారులు సూచించారు. అయితే, గత నెల 13, 14 తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన ఉన్నత విద్యా మండలి ఇవాళ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Next Story