- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా 158లో నివేదా పెతురాజ్.. ఫైనల్లీ క్లారిటీ వచ్చేసింది
వైవిధ్యమైన పాత్రలతో, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్.. లవ్, బ్రేకప్ తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది.

దిశ, సినిమా: వైవిధ్యమైన పాత్రలతో, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నివేదా పేతురాజ్.. లవ్, బ్రేకప్ తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్‌లు అందుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టులో ఈ అమ్మడు భాగం అయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న వార్తలను నిజం చేస్తూ టీమ్ అధికారింగా ప్రకటించింది. ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా సెకండ్ షెడ్యూల్ పొల్లాచిలో కంప్లీట్ చేసుకున్నట్లు టీమ్ ప్రకటించారు.
ఈ సందర్భంగా నివేదా బర్త్‌డే కావడంతో షూటింగ్ సెట్‌లోనే కేక్ కట్ చేసి.. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పంచుకోగా అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో మెగా 158లో నివేదా భాగం అయినట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసినట్లు అయింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగా ఆఫర్ నివేదా కెరీర్‌కు మంచి మలుపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.






