- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ శాఖ మానవత్వం.. హోంగార్డుల కుటుంబాలకు రూ.38 లక్షల చెక్కు అందజేత
ప్రమాదవశాత్తు మరణించిన హైదరాబాద్ పరిధిలోని ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అందజేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ శాఖ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. కొద్ది రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు రూ. 38 లక్షల చెక్కులను అందజేశారు. వివరాల్లోకి వెళితే.. విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంక్ పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని అందించి కొండంత అండగా నిలిచాయి. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన సదరు హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.38 లక్షల చొప్పున ప్రమాద బీమా (Accidental Insurance) క్లెయిమ్ చెక్కులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CP సజ్జనార్ స్వయంగా అందజేశారు.
యాక్సిస్ బ్యాంక్ ఇన్సూరెన్స్ కవరేజీ..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులు సయ్యద్ హుస్సేన్, సింహగిరి ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. సయ్యద్ హుస్సేన్ నీటిలో మునిగి చనిపోగా, సింహగిరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, హోంగార్డుల సంక్షేమం కోసం పోలీస్ శాఖ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల వీరి వేతన ఖాతాలకు (Salary Accounts) ప్రమాద బీమా కవరేజీ సదుపాయం ఉంది. దీంతో యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ఈ బీమా మొత్తాన్ని త్వరితగతిన మంజూరు చేసింది.
బాధిత కుటుంబాలకు సీపీ భరోసా..
బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో బ్యాంక్ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సీపీ వీసీ సజ్జనార్ ఈ చెక్కులను పంపిణీ చేశారు. సయ్యద్ హుస్సేన్ భార్య రేష్మా బేగం, సింహగిరి భార్య భవానీలకు రూ. 38 లక్షల చొప్పున చెక్కులను అందించి, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారి కుటుంబాలకు తోడుగా ఉంటుందని గట్టి నమ్మకాన్ని ఇచ్చారు. లబ్ధిదారులకు క్లెయిమ్ త్వరగా అందేలా సహకరించిన యాక్సిస్ బ్యాంక్ అధికారులను ఈ సందర్భంగా సీపీ అభినందించారు.






