- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ ఓజీ కాదు.. క్యాబేజీ : రోజా
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మహిళా నేత, మాజీ మంత్రి ఆర్.కె. రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్ డెస్క్ : జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మహిళా నేత, మాజీ మంత్రి ఆర్.కె. రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను విమర్శిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒక "సూపర్ ప్లాప్ నేత" అని అభివర్ణించిన రోజా, ఆయనను నమ్ముకున్న వారందరినీ నట్టేటా ముంచేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
కాపులను వాడుకొని వదిలేశారు
ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, వారి సెంటిమెంట్‌తో ఆడుకుని ఓట్లు వేయించుకున్నారని రోజా మండిపడ్డారు. తీరా ఎన్నికలు అయిపోయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గెలిచిన తర్వాత ఇప్పుడు ఆ వర్గాన్ని పట్టించుకోకుండా పొమ్మంటున్నారంటూ విమర్శించారు. అలాగే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును అప్పట్లో పవన్ కళ్యాణ్ తన రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ కుటుంబానికి న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఆ ఉదంతంపై పవన్ కళ్యాణ్ అసలు ఏమీ తెలియనట్లే నటిస్తూ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
'ఓజీ’ కాదు.. పెద్ద క్యాబేజీ'
"పవన్ కళ్యాణ్ ఓజీ కాదు.. ఆయనొక పెద్ద క్యాబేజీ" అంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో కష్టపడుతున్న కూలీలకు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వడం లేదని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనీసం న్యాయం చేయడం చేతకాని పవన్ కళ్యాణ్.. పక్క రాష్ట్రమైన తెలంగాణ (TG)ను ఉద్ధరిస్తానంటూ పెద్దపెద్ద మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడంటూ తీవ్రంగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ కేవలం మాటలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయన పూర్తి విఫలమయ్యారని రోజా దుయ్యబట్టారు.






